గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ రిసెప్షన్ | Celebrities Attends Akkineni Akhil And Zainab Ravdjee Wedding Reception, Photos Viral | Sakshi
Sakshi News home page

Akhil Reception: అఖిల్ రిసెప్షన్.. మహేశ్ బాబు, సూర్య సందడి

Jun 8 2025 8:57 PM | Updated on Jun 9 2025 10:16 AM

Akhil Reception And Wife Zainab

అక్కినేని అఖిల్.. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున ఇంటిలోనే ఈ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. తాజాగా ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ రిసెప్షన్ జరిగింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరిగింది. ఇప్పుడు అఖిల్ వివాహ నాగ్ ఇంట్లో జరగ్గా.. రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యాడు. హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి హాజరయ్యారు. వీళ్లతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.

నాగ్ చిన్న కొడుకు అఖిల్‌కి గతంలోనే శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. తర్వాత కొన్నాళ్లకు జైనబ్‌తో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే తన బంధాన్ని రహస్యంగా ఉంచాడు. గతేడాది నవంబరులో ఆమెతో ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement