హీరోయిన్ త్రిష సర్‌ప్రైజ్.. సీఎం విజయ్‌కు విషెస్..! | Kollywood actress Trisha Birthday wishes To CM Vijay | Sakshi
Sakshi News home page

Trisha: త్రిష మరో సర్‌ప్రైజ్.. సీఎం విజయ్‌కు విషెస్..!

Jun 23 2026 8:00 PM | Updated on Jun 23 2026 9:53 PM

Kollywood actress Trisha Birthday wishes To CM Vijay

హీరోయిన్ త్రిష అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ రోజే దళపతి విజయ్‌ను అన్‌ఫాలో చేసిన ముద్దుగుమ్మ.. ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవన్నీ విలువైనవిగా చేసే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. కానీ ఈనెల 22న సీఎం విజయ్ బర్త్‌ డే కాగా.. ఒక రోజు ఆలస్యంగా విష్ చేయడంతో ఫ్యాన్స్‌ షాకవుతున్నారు.

సోమవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం త్రిష నుంచి స్పెషల్ విషెస్ వస్తుందని ఎదురుచూశారు. రోజు గడిచిపోయింది కానీ ఎలాంటి శుభాకాంక్షల పోస్ట్ కనిపించలేదు. తాజాగా ఇవాళ విజయ్‌కు పుట్టినరోజు విషెస్ చెప్పడం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

త్రిష పేరు వైరల్..

హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం మాటేమో గానీ ఆ టైంలో హీరోయిన్ త్రిష తెగ వైరలైంది. వీళ్లిద్దరూ డేటింగ్ ఉన్నారనే రూమర్సే దీనికి కారణం. ఇదే కాదు విజయ్ వదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఉపఎన్నిక కోసం త్రిషనే పోటీలో నిలబెడతారనే రూమర్స్ కూడా వచ్చాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement