షాకింగ్ డెసిషన్.. మనసుకు విశ్రాంతి కావాలి | Kayadu Lohar Takes Break From Social Media | Sakshi
Sakshi News home page

Kayadu Lohar: కాయదు ఎందుకిలా చేసింది?

Jun 20 2026 7:53 PM | Updated on Jun 20 2026 8:11 PM

Kayadu Lohar Takes Break From Social Media

స్వతహాగా అసోం అమ్మాయి అయినప్పటికీ తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాయదు లోహర్. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మనసుకు విశ్రాంతి కావాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)

'సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. శరీరానికి ఇచ్చినట్లే మనసుకూ విశ్రాంతి కావాలి. ‍స్క్రీన్‌కి దూరంగా ఉండి నాతో నేను ఎక్కువ టైం గడపాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసి ప్రేమ చూపించిన వాళ్లకు థ్యాంక్స్. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంది. అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నా' అని కాయదు పోస్ట్ పెట్టింది.

తెలుగులో 'అల్లూరి' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైనప్పటికీ ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రం ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అలా తెలుగు, తమిళ, మలయాళంలో పలు మూవీస్ చేసింది. ప్రస్తుతానికైతే తమిళంలో ఇమ్మోర్టల్, తెలుగులో 'ప్యారడైజ్' చేస్తోంది. మరి కెరీర్ పరంగా బాగానే ఉన్న టైంలో ఇలా సోషల్ మీడియాకు ఎందుకు బ్రేక్ ఇచ్చిందో?

(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement