భ‌ర్త‌తో ఉన్న ఫోటోలు డిలీట్ చేయ‌మ‌న్న క‌త్రినా! | Katrina Kaif And Vicky Kaushal Asks Paparazzi To Delete Their Pics | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో స్టార్ క‌పుల్‌.. త‌మ‌ ఫోటోలు డిలీట్ చేయమ‌న్న హీరోయిన్‌

May 2 2024 8:32 PM | Updated on May 2 2024 9:16 PM

Katrina Kaif And Vicky Kaushal Asks Paparazzi To Delete Their Pics

ఆమె కేవ‌లం త‌న ఫోటోలు మాత్ర‌మే తీయ‌మంది. మిగ‌తావి డిలీట్ చేయ‌మ‌ని కోరింది..

సెల‌బ్రిటీలు క‌నిపిస్తే చాలు వ‌ద్దంటున్నా వినిపించుకోకుండా కెమెరామ‌న్లు వారిని క్లిక్‌మ‌నిపిస్తుంటారు. అందులోనూ ప్రేమ ప‌క్షులు క‌నిపించారంటే వెంట‌ప‌డి మ‌రీ ఫోటోలు తీస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే! అలా ఎంతోమంది ఫోటోగ్రాఫ‌ర్లు చిన్న‌పాటి తార‌ల నుంచి పెద్ద పెద్ద సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రినీ ఫాలో అవుతూ త‌మ కెమెరాల‌కు ప‌ని చెప్తుంటారు. 

క‌త్రినా- విక్కీ దొరికిపోయారు
బాలీవుడ్‌లో అయితే మ‌రీనూ..  అన‌న్య పాండే, జాన్వీ క‌పూర్‌, అదితిరావు హైద‌రి.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు వారి ప్రియుల‌తో అడ్డంగా దొరికిపోయారు. అలా అప్ప‌ట్లో క‌త్రినా కైఫ్‌- విక్కీ కౌశ‌ల్ కూడా దొరికిపోయారు. అయితే త‌మ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయ‌మ‌ని కోరార‌ట‌!

ఫోటోలు తీయొద్దు
ఈ విష‌యాన్ని ఫోటోగ్రాఫ‌ర్స్ స్నేహ్‌, విశాల్ వెల్ల‌డించారు.  'ఒక‌సారి కత్రినా.. త‌మ ఫోటోలు తీయొద్ద‌ని కోరింది. కావాలంటే నెక్స్ట్ టైమ్ పిలుస్తాన‌ని త‌న మేనేజర్ నా ఫోన్ నెంబ‌‌ర్ తీసుకున్నాడు. త‌ర్వాత య‌ష్ రాజ్ స్టూడియోస్‌కు ర‌మ్మ‌ని పిలిచి నాకోసం మంచిగా ఫోటోలు దిగారు. విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసుండ‌గా కూడా ఫోటోలు తీశాను. 

ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు
కానీ ఆమె కేవ‌లం త‌న ఫోటోలు మాత్ర‌మే తీయ‌మంది. మిగ‌తావి డిలీట్ చేయ‌మ‌ని కోరింది.. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే అన‌న్యను కూడా ఆదిత్య రాయ్ క‌పూర్‌తో ఉన్న‌ప్పుడు ఫోటోలు తీశాం. కానీ అప్ప‌ట్లో వాటిని త‌ను కూడా డిలీట్ చేయించింది' అని చెప్పుకొచ్చారు.

చ‌ద‌వండి: అభిమానికి రూ.22వేల ఖరీదైన షూ గిఫ్ట్‌.. అంతేకాదు!

Advertisement
 
Advertisement
Advertisement