అభిమాని బర్త్‌డే.. కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్‌ | John Abraham Gifts Costly Shoes to Fan on his Birthday | Sakshi
Sakshi News home page

అభిమానికి రూ.22వేల ఖరీదైన షూ గిఫ్ట్‌.. అంతేకాదు!

May 2 2024 6:04 PM | Updated on May 2 2024 6:46 PM

John Abraham Gifts Costly Shoes to Fan on his Birthday

అవ‌న్నీ చూసి ఆశ్చర్య‌పోయిన జాన్ అబ్ర‌హం అభిమానికి సైతం మర్చిపోలేని బ‌హుమ‌తిచ్చాడు. రూ.22,000 ఖరీదు చేసే కాస్ట్‌లీ షూల‌ను గిఫ్టి

హీరోల కోసం అభిమానులు ఎక్క‌డివ‌ర‌కైనా వెళ్తారు. త‌మ పుట్టిన‌రోజు కూడాసెల‌బ్రేట్ చేసుకుంటారో లేదో కానీ తార‌ల బర్త్‌డేను మాత్రం గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తారు. వారి సినిమా రిలీజ‌వుతుందంటే పండ‌గ చేసుకుంటారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూస్తారు. అంత‌లా ఆరాధిస్తారు. అందుకే చాలామంది తార‌లు అభిమానుల‌నే అస‌లైన ఆస్తిగా పరిగ‌ణిస్తారు.

అందుకే ఇక్క‌డో హీరో అభిమానికి గుర్తుండిపోయే బ‌హుమ‌తిచ్చాడు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్ర‌హం.. అక్ష‌య్ కేదరి అనే అభిమానిని అత‌డి బ‌ర్త్‌డే రోజు క‌లుసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అక్ష‌య్ త‌న ఫేవరెట్‌ గిఫ్టుల మీద గిఫ్టులిచ్చాడు. అందులో అత‌డికిష్ట‌మైన బైక్స్ బొమ్మ‌లున్నాయి. 

అవ‌న్నీ చూసి ఆశ్చర్య‌పోయిన జాన్ అబ్ర‌హం అభిమానికి సైతం మర్చిపోలేని బ‌హుమ‌తిచ్చాడు. రూ.22,000 ఖరీదు చేసే కాస్ట్‌లీ షూల‌ను గిఫ్టిచ్చాడు. అంతేకాదు.. స్వ‌యంగా త‌నే అత‌డి షూ లేస్ క‌ట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

చ‌ద‌వండి: 

Advertisement
 
Advertisement
Advertisement