సింగిల్‌ క్యారెక్టర్‌తో వస్తోన్న హలో బేబీ.. ట్రైలర్ చూశారా? | Hero Aadi Saikumar Released Hello Baby Trailer today | Sakshi
Sakshi News home page

Hello Baby Trailer: తొలిసారి అలాంటి కాన్సెప్ట్‌తో హలో బేబీ.. ట్రైలర్ చూశారా?

Aug 3 2024 9:26 PM | Updated on Aug 3 2024 9:27 PM

Hero Aadi Saikumar Released Hello Baby Trailer today

కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హలో బేబీ. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఎస్‌కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది. హీరో  ఆది సాయికుమార్ చేతుల మీదుగా  ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ..'ట్రైలర్ చూస్తుంటే సోలో క్యారెక్టర్‌తో తో సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయం. ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందిన ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుంది. హ్యాకింగ్‌పై తీస్తున్న మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారు' అని కొనియాడారు.

నిర్మాతఆదినారాయణ మాట్లాడుతూ..' ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది.  త్వరలోనే చిత్రం రిలీజ్ చేస్తాం. దేశంలోనే మొట్టమొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే చాలా అవార్డులు  వచ్చాయి. హీరోయిన్ కావ్య కీర్తి అద్భుతంగా చేసింది. డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది' అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement