లవ్‌ స్కోర్‌ ఎంత? | First look of Krithi Shetty from Love Insurance Kompany | Sakshi
Sakshi News home page

లవ్‌ స్కోర్‌ ఎంత?

Aug 3 2024 12:38 AM | Updated on Aug 3 2024 12:38 AM

 First look of Krithi Shetty from Love Insurance Kompany

లవ్‌ స్కోర్‌ ఎంత ఉందో చెక్‌ చేసుకుంటున్నారు కృతీ శెట్టి. మరి... స్కోర్‌ ఎంత అంటే ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’లో చూడాలంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘లవ్‌ టుడే’ ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’. విఘ్నేష్‌ శివన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్, విఘ్నేష్‌ భార్య నయనతార ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలోని ప్రదీప్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా కృతీ శెట్టి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చూస్తుంటే 2035 సెప్టెంబరు 9న ఓ హై ఎండ్‌ టెక్నాలజీ మొబైల్‌ ఫోన్‌లో కృతీ శెట్టి లవ్‌ స్కోర్‌ను చెక్‌ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీన్నిబట్టి భవిష్యత్‌లో సోషల్‌ మీడియా ప్రభావం, యువతీ యువకుల తీరు, మానవీయ సంబంధాలు వంటి అంశాలను ఈ చిత్రంలో దర్శకుడు విఘ్నేష్‌ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement