వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్! | Bollywood Actress Tripti Dimri Birthday wishes for boyfriend | Sakshi
Sakshi News home page

Tripti Dimri: వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!

Jan 30 2025 2:59 PM | Updated on Feb 1 2025 3:44 PM

Bollywood Actress Tripti Dimri Birthday wishes for boyfriend

యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్‌ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్‌ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్‌, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్‌-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌ బర్త్‌ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్‌డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌కు ఇన్‌స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో  ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.

సామ్ మర్చంట్ ఎవరంటే?

వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్ల బిజినెస్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు.

ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్  నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement