తనకంటే చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్‌.. క్లారిటీ ఇచ్చేసిందా? | Bollywood Actress Shraddha Kapoor rumoured boyfriend Post Goes Viral | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: అతనితో డేటింగ్‌లో శ్రద్ధా కపూర్.. ఆ పోస్ట్‌ అందుకేనా?

Published Wed, Jun 19 2024 7:21 PM | Last Updated on Wed, Jun 19 2024 7:59 PM

Bollywood Actress Shraddha Kapoor rumoured boyfriend Post Goes Viral

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో సాహో చిత్రంలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. స్ట్రీ-2, చందు ఛాంపియన్‌ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది  తు ఝూథీ మెయిన్ మక్కార్ తన అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన కనిపించింది. ‍అయితే ఈ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్ధా కపూర్‌.. అతనితో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో ఇంతకీ అతను ఎవరా? అంటూ నెటిజన్స్‌ తెగ ఆరా తీస్తున్నారు. అయితే తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమా రిలీజ్ తర్వాత వీరిపై డేటింగ్ రూమర్స్‌ వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ బీ టౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ss

కాగా.. రాహుల్ మోడీ ప్యార్ కా పంచ్‌నామా 2, సోను కే టిటు కి స్వీటీ, ప్యార్ కా పంచ్‌నామా పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. మరోవైపు అతను శ్రద్ధా కపూర్‌ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్‌కు 34 ఏళ్లు కాగా..శ్రద్ధా కపూర్‌ 37 ఏళ్లు. కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో శ్రద్ధా, రాహుల్ జంటగా కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement