
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 9వ సీజన్ చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇంట్లో నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. మూడోవారం నామినేషన్స్‌లో హరీశ్, ప్రియ, కల్యాణ్, రాము, రీతూ,ఫ్లోరా ఉన్నారు. వీరిలో నుంచి ఒకరు బయటకు వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ వీకెండ్‌లో తెలిసిపోతుంది.
ఇప్పటికి వరకు కండబలం, బుద్ది బలంపై ఫోకస్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు భావోద్వేగ బలంపై దృష్టిపెట్టాడు. కంటెస్టెంట్స్ ఎమోషన్‌తో గేమ్ ప్లాన్ చేసినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. హౌస్‌లో ఉన్నవాళ్లకు బిగ్ బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరైతే తొలుత బజర్ ప్రెస్ చేస్తారో..వారికి ఫ్యామిలీ వాళ్లు అందించిన సందేశాలను పంపిస్తామని చెప్పాడు. అయితే అది పొందాలంటే కొంత మూల్యం చెల్లించాల్సిందే అంటూ అక్కడ వందశాతం నిండి ఉన్న బ్యాటరీని చూపించాడు.
బటన్ ప్రెస్ చేసి అవకాశం దక్కించుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ముందు మూడు ఆప్షన్లు పెట్టాడు బిగ్‌బాస్. నాన్న నుంచి వచ్చిన లేఖను పొందలాంటే హౌస్ బ్యాటరీ నుంచి 45 శాతం తగ్గింపోతుందని, అమ్మ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్‌ని పొందాలంటే 30 శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, ఫ్యామిలీ ఫోటోని పొందాలంటే 25శాతం తగ్గుతుందని చెప్పి.. ఇందులో ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. ఇది విని ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ‘నేను ఏడిస్తే..మా అమ్మ తట్టుకోలేదు’ బిగ్‌బాస్ అంటూ కన్నీళ్లు తూడ్చుకున్నాడు. తోటి కంటెస్టెంట్స్ కోసం ఇమ్మాన్యుయేల్ చివరి ఆప్షన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.