విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్ | From Criticism To Gratitude, Bandla Ganesh Praises Trivikram After Past Controversy, Calls Him Guruji | Sakshi
Sakshi News home page

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

Jun 21 2026 11:35 PM | Updated on Jun 22 2026 9:11 AM

Bandla Ganesh addressed Trivikram as Guruji with same mouth he criticized

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో, సోషల్ మీడియా పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారారు. ఒకప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఇప్పుడు “థాంక్యూ గురూజీ.. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.  

తాజాగా ఆదర్శకుటుంబం సినిమా సెట్‌లో త్రివిక్రమ్‌ని బండ్ల గణేష్ కలిసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన బండ్ల గణేష్, ఆయన ఆరోగ్యం, ఆనందం, విజయాలు కొనసాగాలని మనసారా ప్రార్థించారు. గతంలో ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ సందర్భంగా బండ్ల గణేష్, త్రివిక్రమ్‌ను బూతు పదజాలంతో విమర్శలు చేసినట్టు అప్పట్లో ఓ ఆడియో వైరల్‌ అయింది.  ఆ ఫంక్షన్‌కి బండ్ల గణేష్‌ను పిలవలేదు. దానికి కారణం త్రివిక్రమే అని ఆ టైమ్‌లో ఓ పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయి సంచలనం సృష్టించింది. ఆ ఆడియోలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్. నన్ను ఈవెంట్‌కు రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నాడు, చూసుకుందాం అంటూ రెచ్చిపోయాడు. అయితే ఇప్పుడు అదే త్రివిక్రమ్‌ను 'గురూజీ' అని సంబోధిస్తూ కృతజ్ఞతలు తెలపడం నెటిజన్లలో చర్చనీయాంశమైంది.  

ఇటీవల మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు దగ్గరైన బండ్ల గణేష్, చిరంజీవి ‘మెగా 158’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ - గణేష్ చాలా సన్నిహితంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్‌తో కూడా కలిసిపోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement