స్టార్‌ హీరోతో మురగదాస్‌ సినిమా.. అధికారికంగా ప్రకటన | AR Murugadoss Announced Next Movie | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోతో మురగదాస్‌ సినిమా.. అధికారికంగా ప్రకటన

Mar 12 2024 1:22 PM | Updated on Mar 12 2024 1:31 PM

AR Murugadoss Announced Next Movie - Sakshi

సౌత్‌ ఇండియా టాప్‌ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా రోజుల తర్వాత కొత్త సినిమాను ప్రకటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ హీరోగా తను ఒక చిత్రం నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గజిని, స్టాలిన్‌, తుపాకి, 7th సెన్స్, స్పైడర్‌, కత్తి వంటి చిత్రాల ద్వారా సౌత్‌ ఇండియాలో అగ్రగామి దర్శకుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చాయి. బాలీవుడ్‌లో ఇప్పటికే అమీర్‌ ఖాన్‌తో గజనీ చిత్రాన్ని రీమేక్‌ చేసి సూపర్‌ హిట్‌ కొట్టారు. ఆపై సోనాక్షి సిన్హాతో "అకీరా" చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

గతంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్లు అందుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి పెద్దగా సినిమాలు రాలేదు. కానీ కోలీవుడ్‌ హీరో విజయ్‌, శివకార్తికేయన్‌ వంటి స్టార్‌ హీరోలతో మురగదాస్‌ సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి వర్కౌట్‌ కాలేదు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో సినిమా చేసే చాన్స్‌ ఆయనకు దక్కింది.

ఈ యాక్షన్ చిత్రం కోసం ఎఆర్ మురుగదాస్ చాలా కాలంగా స్క్రీన్ ప్లేపై వర్క్ చేస్తున్నారు. దీని ద్వారా ఏఆర్ మురుగదాస్ కమ్ బ్యాక్ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు.  ఈ చిత్రానికి నిర్మాతగా  సాజిద్ నడియాద్వాలా ఉన్నారు. 2025 రంజాన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే అజిత్ కుమార్ హీరోగా బిల్లా, ఆరంభం చిత్రాలకు దర్శకత్వం వహించిన విష్ణు వర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ది బుల్ చిత్రంలో కనిపించనున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మళ్లీ తమిళ దర్శకుడి సినిమాకు ఓకే చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement