breaking news
Muragadass
-
స్టార్ హీరోతో మురగదాస్ సినిమా.. అధికారికంగా ప్రకటన
సౌత్ ఇండియా టాప్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా రోజుల తర్వాత కొత్త సినిమాను ప్రకటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తను ఒక చిత్రం నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గజిని, స్టాలిన్, తుపాకి, 7th సెన్స్, స్పైడర్, కత్తి వంటి చిత్రాల ద్వారా సౌత్ ఇండియాలో అగ్రగామి దర్శకుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చాయి. బాలీవుడ్లో ఇప్పటికే అమీర్ ఖాన్‌తో గజనీ చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆపై సోనాక్షి సిన్హాతో "అకీరా" చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గతంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు అందుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆయన నుంచి పెద్దగా సినిమాలు రాలేదు. కానీ కోలీవుడ్ హీరో విజయ్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో మురగదాస్ సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి వర్కౌట్ కాలేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసే చాన్స్ ఆయనకు దక్కింది. ఈ యాక్షన్ చిత్రం కోసం ఎఆర్ మురుగదాస్ చాలా కాలంగా స్క్రీన్ ప్లేపై వర్క్ చేస్తున్నారు. దీని ద్వారా ఏఆర్ మురుగదాస్ కమ్ బ్యాక్ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా సాజిద్ నడియాద్వాలా ఉన్నారు. 2025 రంజాన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే అజిత్ కుమార్ హీరోగా బిల్లా, ఆరంభం చిత్రాలకు దర్శకత్వం వహించిన విష్ణు వర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ది బుల్ చిత్రంలో కనిపించనున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మళ్లీ తమిళ దర్శకుడి సినిమాకు ఓకే చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. Glad to join forces with the exceptionally talented, @ARMurugadoss and my friend, #SajidNadiadwala for a very exciting film !! This collaboration is special, and I look forward to this journey with your love and blessings. Releasing EID 2025.@NGEMovies @WardaNadiadwala pic.twitter.com/dv00nbEBU1 — Salman Khan (@BeingSalmanKhan) March 12, 2024 -
గజినీ సీక్వెల్లో అల్లు అర్జున్!
అఅ్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీకి కొద్ది రోజుల క్రితం కరోనా సోకడంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో బన్నీ కూడా ఓ మూవీకి సైన్ చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా మురగదాస్‌తో సినిమా చేసేందుకు బన్నీఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గజిని-2 సీక్వెల్ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఎప్పటినుంచో గజినీ మూవీ సీక్వెల్ తీయాలని భావిస్తున్న మురగదాస్‌కు ఇప్పుడు హీరో దొరికేశాడని, ఇందుకు బన్నీ కూడా పచ్చజెండా ఊపినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. సూర్య, అసిన్ హీరో, హీరోయిన్లుగా 2005లో వచ్చిన ఈ సినిమా హిందీలోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గజిని సీక్వెల్‌గా మురగదాస్ మరో కొత్త కథను రూపొందించనున్నారు. మరి ఈ సీక్వెల్ వర్షన్లో బన్నీ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే మురగదాస్-బన్నీ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చ అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. చదవండి : అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు! ‘వల్లంకి పిట్ట’ చిన్నారి ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా! -
రజనీ జోరు.. దర్బార్‌కు భారీ వసూళ్లు
హైదరాబాద్: సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘దర్బార్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. పాజిటివ్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్లు వసూలు చేసింది. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, ఫైట్లతోపాటు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. చాలాకాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో కనిపించడం.. మురగదాస్ తనదైన శైలిలో తెరకెక్కించడం ఈ సినిమాకు కలిసివస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం రజనీకాంత్ యాక్టింగ్, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఇప్పటికీ బలంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాడులోనే తొలిరోజు దాదాపు రూ. 19 కోట్ల వరకు రాబట్టింది. ఇటు దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్, ఓవర్సీస్లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా ‘దర్బార్’భారీ వసూళ్లు రాబడుతోంది. -
23న పాటలు, 31న ‘కత్తి’ విడుదల
తుపాకి’ చిత్రం తర్వాత హీరో విజయ్-దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘కత్తి’. సమంత కథానాయిక. ‘కొలవెరి’ ఫేమ్ అనిరుధ్ స్వరాలందించారు. కె. కరుణామూర్తి, ఎ. శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 23న పాటలు, 31న సినిమా విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ -‘‘ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. హైఓల్టేజ్ యాక్షన్‌తో పాటు సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్లకు మంచి ప్రాధాన్యముంది. మురుగదాస్ ఏ తరహా సినిమా చేసినా వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తారు. చాలా విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా చేశారు. చాలా హార్ట్ టచింగ్ మూవీ ఇది. పాటలకూ మంచి స్కోప్ ఉంది. దీపావళి కానుకగా తెలుగు వెర్షన్ పాటలను విడుదల చేస్తున్నాం. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ కీలకపాత్ర చేసిన ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: ఎ. శ్రీకర్‌ప్రసాద్.