రజనీ జోరు.. దర్బార్‌కు భారీ వసూళ్లు | Rajinikanth Movie Darbar Collects 150 Crores in 4 Days | Sakshi
Sakshi News home page

రజనీ జోరు.. దర్బార్‌కు భారీ వసూళ్లు

Jan 14 2020 4:49 PM | Updated on Jan 14 2020 4:53 PM

Rajinikanth Movie Darbar Collects 150 Crores in 4 Days - Sakshi

హైదరాబాద్‌: సౌత్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా సినిమా ‘దర్బార్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. పాజిటివ్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్లు వసూలు చేసింది. కోలీవుడ్‌ అగ్ర దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన ‘దర్బార్‌’  సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, ఫైట్లతోపాటు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్‌’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది.

చాలాకాలం తర్వాత రజనీ పోలీస్‌ గెటప్‌లో కనిపించడం.. మురగదాస్‌ తనదైన శైలిలో తెరకెక్కించడం ఈ సినిమాకు కలిసివస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ముంబై పోలీసు కమిషనర్‌ అయిన ఆదిత్య అరుణాచలం రజనీకాంత్‌ యాక్టింగ్‌, స్టైల్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుండటంతో ఈ సినిమా ఇప్పటికీ బలంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాడులోనే తొలిరోజు దాదాపు రూ. 19 కోట్ల వరకు రాబట్టింది. ఇటు దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్‌, ఓవర్సీస్‌లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా ‘దర్బార్‌’భారీ వసూళ్లు రాబడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement