ఆపరేషన్‌ అనంతరం వెకేషన్‌లో యాంకర్‌ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో! | Anchor Rashmi Gautam Went To Summer Vacation after her Surgery | Sakshi
Sakshi News home page

Anchor Rashmi: గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌కు సర్జరీ.. ఎన్నడూ ఇలా జరగలేదు

Apr 26 2025 12:59 PM | Updated on Apr 26 2025 2:08 PM

Anchor Rashmi Gautam Went To Summer Vacation after her Surgery

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ (Rashmi Gautam) ఇటీవల తీవ్ర అనారోగ్యంపాలైంది. రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఆపరేషన్‌ కూడా అయింది. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్‌ (గడ్డలు)ను ఆపరేషన్‌ చేసి తొలగించారని రష్మీ స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఏప్రిల్‌ 18న తనకు శస్త్ర చికిత్స జరిగిందని.. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. డాక్టర్ల సూచన మేరకు మూడువారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది.

బాలి దీవుల్లో రష్మీ
అయితే పనికి ఎలాగో బ్రేక్‌ ఇచ్చిన రష్మీ.. ఈ మండుటెండల్లో కాస్త సేద తీరేందుకు విహారయాత్రకు వెళ్లింది. ఫ్రెండ్స్‌తో కలిసి బాలి దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది. పండ్లు, కేక్‌ ఇష్టంగా ఆరగిస్తోంది. అవే కాకుండా డాక్టర్‌ రాసిచ్చిన మందుల్ని కూడా క్రమం తప్పకుండా వేసుకుంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. "రెండు నెలల క్రితం ఈ ట్రిప్‌ ప్లాన్‌ చేశాం. కాకపోతే ఆటలుపాటలు.. ఇలా ఫుల్‌ ఎంజాయ్‌ చేయాలనుకున్నాం.

దేవుడే ఇలా చేస్తాడేమో!
తీరా చూస్తే ఇప్పుడు తినడం, పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడం.. వీటితోనే సరిపెట్టుకుంటున్నాం. విహారయాత్రల్లో ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. బహుశా దేవుడు.. మనకు జీవితంలో అన్నీ తెలుసుకునేందుకు ఇలా చేస్తాడేమో! ప్రస్తుతం బాలిలోని ఓ విల్లాలో నా ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో సేద తీరుతున్నా.." అని రష్మీ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.

 

 

చదవండి: ప్రియదర్శికి స్టార్ హీరో దంపతుల సర్‌ప్రైజ్‌.. ఇంతకీ అదేంటంటే?

Advertisement
 
Advertisement
Advertisement