హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్! | Ananya Panday reacts after Sara Ali Khan confirms her dating rumours | Sakshi
Sakshi News home page

Ananya Panday: ఆదిత్యతో డేటింగ్ రూమర్స్.. సిగ్గుపడుతూ ఒప్పేసుకున్న హీరోయిన్!

Nov 5 2023 12:28 PM | Updated on Nov 5 2023 1:08 PM

Ananya Panday reacts after Sara Ali Khan confirms her dating rumours  - Sakshi

బాలీవుడ్ భామ ఇటీవలే అనన్య పాండే ఇటీవలే తన పుట్టినరోజును జరుపుకున్నారు. తన రూమర్‌డ్ బాయ్‌ఫ్రెండ్‌ ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ వీడియోలో కనిపించారు. తాజాగా ఇండియాకు తిరిగొచ్చిన భామ కాఫీ విత్ కరణ్‌ షోకు హాజరైంది. మరో నటి సారా అలీ ఖాన్‌తో కలిసి పాల్గొంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: 'అసలు ఏంట్రా ఇదంతా.. ఏం చేస్తున్నారు హౌస్‌లో..'!)

‍అయితే ఈ షోలో పాల్గొన్న  సారా అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షోలో పాల్గొన్న సారాను కరణ్ ఆసక్తిక ప్రశ్న వేశారు. ప్రస్తుతం అనన్య పాండే వద్ద ఉన్న వస్తువు ఏంటి? అని అడిగారు. దీనికి సారా స్పందిస్తూ 'ది నైట్ మేనేజర్' అంటూ సమాధానమిచ్చింది. అయితే ఇది విన్న అనన్య తెగ సిగ్గు పడిపోయింది. తాను అనన్య రాయ్ కపూర్‌గా భావిస్తున్నాను అంటూ మనసులో మాట చెప్పేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్ నటించారు. 
 
కాగా.. సారా అలీ ఖాన్ మెట్రో అనే చిత్రంలో కనిపించనుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. మరోవైపు అనన్య పాండే.. ఖో గయే హమ్ కహాన్ అనే చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత కాల్ మీ బే అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లో కూడా నటించనుంది.

(ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్‌ ఫ్రెండ్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement