బరువు తగ్గాలంటే..? సింపుల్‌గా ఈ చిట్కాలు పాటించండి: అక్షయ్‌ కుమార్‌ | Akshay kumar Repost Prime Minister Modi Comments On Obesity | Sakshi
Sakshi News home page

బరువు తగ్గాలంటే..? సింపుల్‌గా ఈ చిట్కాలు పాటించండి: అక్షయ్‌ కుమార్‌

Jan 31 2025 8:40 AM | Updated on Jan 31 2025 10:34 AM

Akshay kumar Repost Prime Minister Modi Comments On Obesity

ఈమధ్య పదేళ్లలోపు పిల్లలు కూడా ఊబకాయం బారిన పడటం చూస్తున్నాం. ఊబకాయం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు వంటి సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. దీంతో  మానసిక, భావోద్వేగ ఆరోగ్యం మీదా అధికబరువు ప్రభావం చూపుతుంది. దేశంలో చాలామంది ఇలాంటి ఆందోళన సమస్యలతోనూ సతమతమవుతుంటారు. ఇదే అంశం గురించి తాజాగా ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు.  దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని ఉత్తరాఖండ్‌ పర్యటనలో అన్నారు. ఫిట్‌నెస్‌పై అందరూ దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఊబకాయం చాలా వ్యాధులకు మూలం అని ఆయన గుర్తు చేశారు.   

(ఇదీ చదవండి: నటి శోభన పెళ్లెందుకు చేసుకోలేదంటే..?)

స్థూలకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశంలో బాగా పెరిగిపోతోందని, ఇది గుండె, మధుమేహం వంటి సమస్యలకు దారి తీయవచ్చని మోదీ అన్నారు. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం ద్వారా దేశంలోని నేటి యువత ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి పలు వ్యాఖ్యలు చేశారు.  మోదీ (Narendra Modi) చేసిన ప్రసంగాన్ని ‘ఎక్స్‌’  వేదికగా  బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) రీపోస్టు చేస్తూ.. మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆపై బరువు తగ్గుదాం అనుకునే వారికి కొన్ని చిట్కాలను కూడా ఇచ్చారు.

'ప్రధాని మోదీ చెబుతున్నట్లుగా  ఊబకాయం వల్ల చాలా జబ్బులు వస్తాయి.  ప్రధాని మోదీ చెప్పింది ముమ్మాటికి వాస్తవం. ఇదే విషయాన్ని చాలా ఏళ్ల నుంచి నేను కూడా చెబుతూనే ఉన్నాను. ప్రస్తుతం మోదీనే ఇదే విషయం చెప్పడంతో చాలామందికి రీచ్‌ అవుతుంది. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఊబకాయం నుంచి మనం బయటపడాలంటే సరిపడ నిద్రదో పాటు స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి ఉండాలి. సూర్యరశ్మి సమయంలో మనం అడుగులు వేయాలి. 

మన వంటకాల్లో తక్కువ నూనె వాడకం ఉండేలా చూసుకోవాలి. ఆపై దేశీ నెయ్యి  విరివిగా వినియోగించాలి.  ఊబకాయంతో పోరాడే దేశ ప్రజలందరికీ ఇవే పెద్ద ఆయుధాలుగా ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరు మీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోండి.  కచ్చితంగా రోజూ చేసేలా ప్లాన్‌ చేసుకోండి. ముమ్మాటికి ఈ విషయాన్ని నమ్మండి. ఈ చిట్కాలతో స్థూలకాయం నుంచి బయటపడొచ్చు.' అని అక్షయ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement