ఇక చాలు ఆపండి, మీ కాళ్లు మొక్కుతా..: విశాల్‌ | Actor Vishal Tweet About Coimbatore Horror | Sakshi
Sakshi News home page

Vishal: దయచేసి నిందించడం ఆపండి.. మీ కాళ్లు మొక్కుతా..

Nov 8 2025 11:48 AM | Updated on Nov 8 2025 12:02 PM

Actor Vishal Tweet About Coimbatore Horror

సాక్షి, తమిళనాడు: కోయంబత్తూర్‌ విమానాశ్రయం సమీపంలో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితుడితో కారులో ఉన్న విద్యార్థినిని ముగ్గురు యువకులు అపహరించి, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 

ఇకచాలు, ఆపండి
అయితే రాత్రిపూట ఆ విద్యార్థిని బయటకు ఎందుకెళ్లిందని ఎమ్మెల్యే ఈశ్వరన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరాత్రి పురుషుడితో బయటకు వెళ్లడాన్ని సామాజిక పతనంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లుఉవెత్తాయి. తాజాగా హీరో విశాల్‌ (Vishal) సైతం ఈ వ్యవహారంపై స్పందించాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో బాధితురాలు ఎందుకు ఉందని నిందించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న ఈ అత్యాచారాలను రాజకీయం చేయండి మానుకోండి.

మీ కాళ్లు మొక్కుతా..
న్యాయవ్యవస్థ ముందు మోకరిల్లి అడుగుతున్నా.. మీ కాళ్లు పట్టుకుంటా.. దయచేసి ఇంత దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులకు మరణశిక్ష వేయండి. గతంలో నిర్భయ ఉదంతాలను చూశాం. ఏడేళ్ల బాలికను అత్యాచారం చేయడంతో పాటు కన్న తల్లిని నిర్దాక్ష్యిణ్యంగా హత్య చేసిన వ్యక్తి సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో నిర్దోషిగా బయటకు వచ్చాడు. 

వైఎస్సార్‌కు సెల్యూట్‌
ఇలాంటివి సౌదీ అరేబియా వంటి దేశాల్లో సాధ్యమవుతాయా? ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న చర్యలు నిజంగా మెచ్చుకోదగినవి. ఆయనకు నేను సెల్యూట్‌ చేస్తున్నా.. అని విశాల్‌ ట్వీట్‌ చేశాడు.

 

 

చదవండి: ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement