క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Dec 24 2025 4:20 AM | Updated on Dec 24 2025 4:20 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

ఎంఐసీఈ వేదికగా

అద్భుత ఫలితాలు

సాక్షి, చైన్నె: మీట్‌ గ్లోబల్‌ ఎంఐసీఈ కాంగ్రెస్‌ విజయవంతంతో, అద్భుత ఫలితాలు దక్కినట్టు విజ్‌క్రాఫ్ట్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సబ్బాస్‌ జోసెఫ్‌ ప్రకటించారు. మీట్‌ గ్లోబల్‌ ఎంఐసీఈ కాంగ్రెస్‌ (ఎంజీఎంసీ) ద్వారా ఒకే వేదికపై 37 దేశాల ప్రతినిధులు వచ్చినట్టు వివరించారు. వర్తకం, పర్యాటక రంగంలో ప్రగతి దిశగా జరిగిన ఈ సదస్సుగురించి ఆయన వివరిస్తూ, వ్యాపార పర్యాటక రంగంలో ప్రపంచ ప్రఖ్యాత కేంద్రంగా మాస్కోకు హోదాను అంతర్జాతీయ కాంగ్రెస్‌ నిర్ధారించిందని ప్రకటించారు. ఎంజీఎంసీ 2025కి 53 మంది ఆతిథ్య కొనుగోలు దారులు హాజరయ్యారని, ఈ వేదిక 37 దేశాల ప్రతినిధులకు ప్రయోజనకరంగా మారిందన్నారు. గతంతో పోల్చితే 2 రెట్లు ఎక్కువగా ఫలితాలు అద్భుతంగా సాధించామన్నారు. 70 శాతం మంది సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌లతో పాటూ కొత్త పరిచయాలకు వేదికగా నిలిచిందన్నారు.ఈ సమావేశంలో ఇండియన్‌ కన్వెన్షన్‌ ప్రమోషన్‌ బ్యూరో గవర్నింగ్‌ బోర్డు సభ్యుడు తుషార్‌ కేషర్వానీ, విజిట్‌ ఖతార్‌ ఎంఐసీఈ డైరెక్టర్‌ రుక్యా కాశీమ్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ ఆఫ్రికన్‌ ఎగ్జిభిషన్‌ ఆర్గనైజర్స్‌ ప్రొజెనీ పాఽథర్‌, కెన్యా యాక్టనబుల్‌ ఏఐ వ్యవస్థాపకుడు ధరేంద్ర జైన్‌ పాల్గొన్నారు.

జోలార్‌పేటలో

దంపతుల ఆత్మహత్య

వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని కేఆర్‌ఎస్‌ ప్రాంతానికి చెందిన సహాదేవన్‌(45) అదే ప్రాంతంలో తోపుడు బండిలో చికెన్‌ పకోడ దుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య మేరి(43). దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. ఈ నేపథ్యంలో సహాదేవన్‌ సోమవారం సాయంత్రం వ్యాపారానికి వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. మేరి ఇంటిలోనే ఉంది. ఇద్దరూ కలిసి బోజనం చేసి పిల్లలతో కలిసి పడుకున్నారు. అయితే మంగళవారం ఉదయం ఇంటి నుంచి ఎవరూ బయటకు రాక పోవడంతో అనుమానంతో స్థానికులు వెళ్లి చూడగా దంపతులు ఇద్దరూ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న జోలార్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృత దేహాలను ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. దంపతులు ఇద్దరూ రాత్రి ఘర్షణ పడ్డారా..? ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జైలులో

ఉపాధ్యాయుడి మృతి

తిరువొత్తియూరు: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉపాధ్యాయుడు హఠాత్తుగా స్ప్పహ తప్పిపడి మృతిచెందారు. వివరాలు.. ధర్మపురి జిల్లా, నిలంపల్లి అంబేడ్కర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన మణివణ్ణన్‌ ( 55) బాలజంగమన్‌ హళ్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినికి మణివణ్ణన్‌ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదు రావడంతో జిల్లా ముఖ్య విద్యాశాఖ అధికారి జ్యోతి చంద్ర, జిల్లా విద్యాశాఖ అధికారి పెరుమాళ్‌ విచారణ జరిపి వేరే పాఠశాలకు బదిలీ చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు జరిపిన విచారణ అనంతరం, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు మణివణ్ణన్‌ను సస్పెండ్‌ చేశారు. దీని తరువాత, ధర్మపురి మహిళా పోలీసులు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈనెల 16వ తేదీ రాత్రి మణివణ్ణన్‌ను అరెస్టు చేశారు. విచారణ అనంతరం, అతనిని సోమవారం రాత్రి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి, ధర్మపురి జిల్లా జైలులో నిర్బంధించారు. దీంతో జైలులో ఉన్న మణివణ్ణన్‌ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. ఇది చూసిన అధికారులు వెంటనే అతనిని ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కార్మికుడి దారుణ హత్య

అన్నానగర్‌: తూత్తుకుడి జిల్లాలో ఓ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. తూత్తుకుడి జిల్లా ఆళ్వార్‌ తిరునగరి అళగు ముత్తమ్మాల్‌ కోవిల్‌ వీధికి చెందిన ఇసక్కముత్తు (42) కార్మికుడు. ఇతని భార్య నంబిల (39). వీరికి ముగ్గురు కుమారులు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఇసక్కిముత్తు తన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. ఆసమయంలో అక్కడికి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న ఆళ్వార్‌ తిరునగరి పోలీసులు ఇసక్కిముత్తు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నైల్లె ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో అదే ప్రాంతానికి చెందిన సుబ్బయ్య కుమారుడు ముత్తు (21) ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement