జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఎప్పుడంటే? | 72nd National Film Awards likely to be announced next week | Sakshi
Sakshi News home page

National Film Awards: జాతీయ సినీ అవార్డుల ప్రకటన.. ఎప్పుడంటే?

Jul 3 2026 8:29 PM | Updated on Jul 3 2026 8:31 PM

72nd National Film Awards likely to be announced next week

ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా వాయిదా పడింది. ఇవాళ జాబితా వస్తుందని ఆశించినప్పటికీ అలా జరగలేదు. ఈ అవార్డుల జాబితా ప్రకటన వచ్చే వారానికి వాయిదా వేశారు. కానీ ఎప్పుడనేది తేదీ ఖరారు చేయలేదు. అవార్డుల ప్రకటన తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ విషయంపై ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది.

కాగా.. 2024లో విడుదలైన సినిమాల జాబితాను ఈ అవార్డులకు పరిగణనలోకి తీసుకొనున్నారు. ప్రతి ఏటా సినిమా రంగంలో నటన, దర్శకత్వం, రచన, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో అత్యుత్తమంగా రాణించివారికి ఈ పురస్కారాలు అందజేస్తారు. ఈ అవార్డుల పోటీలో పుష్ప-2, కల్కి, బ్రహ్మయుగం, అడుజీవితం: ది గోట్ లైఫ్, మంజుమ్మెల్ బాయ్స్, ఆర్టికల్ 370, మహారాజా, చందు ఛాంపియన్ లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. పుష్ప-2, కల్కి పోటీలో ఉండడంతో సినీ అభిమానులలో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement