12న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Sep 6 2026 8:31 AM | Updated on Sep 6 2026 8:31 AM

12న జాతీయ లోక్‌ అదాలత్‌ తాగునీటి కోసం బిందెలతో నిరసన సీఎం అన్ని రంగాల్లో విఫలం

న్యాయమూర్తి సుచరిత

అల్లాదుర్గం(మెదక్‌): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అల్లాదుర్గంలో ఈ నెల 12న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ సుచరిత వెల్లడించారు. అల్లాదుర్గం కోర్టులో పోలీస్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజీ కుదుర్చుకోవడానికి కక్షిదారులకు లోక్‌ అదాలత్‌ ఉపయోగపడుతుందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న పోలీస్‌ అధికారులు కక్షిదారులకు సంపూర్ణ సహకారాలు అందించి, లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, ఎస్‌ఐలు శంకర్‌, ప్రవీణ్‌రెడ్డి, పోచయ్య, కోర్టు సూపరింటెండెంట్‌ పద్మావతి, లీగల్‌ సర్వీస్‌ సిబ్బంది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండల కేంద్రంలోని 13వ వార్డులో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఎస్సీ కాలనీలోని 13 వార్డులో మిషన్‌ భగీరథ తాగునీరు సరిగా రావడంలేదని మహిళలు తెలిపారు. విషయం ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పినా ఫలితంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడకపోతే గ్రామపంచాయతీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

రేవంత్‌ సర్కార్‌పై ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజం

నర్సాపూర్‌: కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని రంగాల్లో ఫెయిల్‌ అయ్యారని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆయా పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు, బీఆర్‌ఎస్‌ నాయకులతో స్థానిక పిల్లలపార్కు నుంచి ర్యాలీగా స్థానిక చౌరస్తా చేరుకుని ధర్నా చేపట్టారు. ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడుతూ...వెయ్యి రోజుల పాలనలో రేవంత్‌రెడ్డి అన్ని రంగాల్లో విఫలం చెందారన్నారు. విద్యామంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆ రంగాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 97జీఓను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే సీఎంకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిరుద్యోగులకు తన వంతు సహకారం అందించాలన్న లక్ష్యంతో సునీతమ్మ ఉద్యోగ మిత్ర యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు సునీతారెడ్డి ప్రకటించారు. ఇదిలాఉండగా ధర్నాలో పాల్గొన్న పలువురు విద్యార్థులు మాట్లాడుతూ...తమ గ్రామాలకు ఆర్‌టీసీ బస్సులు రానందున తాము ఇబ్బందుల పాలవుతున్నామని చెప్పగా ఎమ్మెల్యే స్పందిస్తూ ఆర్‌టీసీ అధికారులతో మాట్లాడి ఆయా మార్గాల్లో బస్సులను పునరుద్ధరించే విధంగా కృషి చేస్తానని వారికి హామీనిచ్చారు. ధర్నాలో బీఆర్‌ఎస్‌ నాయకులు దేవేందర్‌రెడ్డి, శేఖర్‌, మన్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement