జాతీయ రాక్‌బాల్‌ పోటీలు షురూ | - | Sakshi
Sakshi News home page

జాతీయ రాక్‌బాల్‌ పోటీలు షురూ

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాల జాతీయస్థాయి రాక్‌బాల్‌ పోటీలకు వేదికగా మారింది. ఆదివారం 10వ సీనియర్‌ నేషనల్‌, 7వ సీనియర్‌ మిక్స్‌డ్‌ నేషనల్‌ రాక్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ఘనంగా ప్రారంభమైంది. ము ఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న అజయ్‌ ట్రస్టు చైర్మన్‌, సౌత్‌ ఇండియా రా క్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీయాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గెలుపోటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని హితవుపలికారు. కార్యక్రమంలో సౌత్‌ ఏషియా రాక్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భూపేందర్‌ సాగ్వాన్‌, ఆల్‌ ఇండియా రాక్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివకుమార్‌, ఉమ్మడి మెదక్‌ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ రాజమణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌యాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈసారి రాక్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశంలోని 16 రాష్ట్రాల నుంచి మొత్తం 24 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 42 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు నర్సాపూర్‌కు చేరుకోవడంతో పట్టణంలో క్రీడా సందడి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement