నారాయణఖేడ్: కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజాగౌడ్ డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ల పరిష్కారం కోసం చేపడుతున్న యాత్రకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన మండల కేంద్రమైన నిజాంపేటలో ఆదివారం సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కమలాగౌడ్, ఉపాధ్యక్షుడు ప్రతాప్‌గౌడ్, జిల్లా, స్థానిక సంఘం బాధ్యులు శివకుమార్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, ఎల్లాగౌడ్, దుర్గాగౌడ్, వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు.


