రైతులకు జీవనాధారం...పంటలకు ప్రాణాధారమైన సాగునీరు వృథాగా పోతుంది. నీటిని చెరువుల్లోకి మళ్లించాల్సిన అధికారులు తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని చేతులెత్తేయగా పంటకాల్వల నుంచి దిగువకు వెళ్తున్న నీటిని చెరువుల్లో నింపి భద్రపరచాల్సి ఉంది. కానీ, సాగునీటి కాల్వల తూములు ధ్వంసం కావటంతో దిగువభాగంలోకి వృథాగా పోతున్నాయి. కొన్ని చెరువులకు మాత్రమే సరఫరా అవుతుండగా చివరాయ కట్టుగ్రామాలకు అంతంతమాత్రంగానే సరఫరా అవుతుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మెదక్‌జోన్:
వృథాగా పోతున్న ప్రాజెక్టు నీరు
సంరక్షణ శూన్యం
‘వీబీజీ రామ్‌జీ’పథకంలో..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వీబీజీ రామ్‌జీ’పథకంలో చెరువులు, నీటి కాల్వలకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలి.
–సత్యనారాయణ, సర్పంచ్, జక్కన్నపేట
ధ్వంసమైన పంటకాల్వల తూములు 15 రోజులుగా దిగువకు నీళ్లు
మెతుకుసీమలో ఏకై క మధ్యతరహా ఘనాపురం ప్రాజెక్టు ఉంది. దీని సామర్థ్యం 0.367టీఎంసీలు మాత్రమే. ఇది పూర్తిగా సింగూర్ ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఏటా విడతల వారీగా సింగూర్ నుంచి ఇందులోకి నీటిని వదులుతారు. కానీ, ఈ ఏడు సింగూర్ మరమ్మతుల నేపథ్యంలో అందులో నీటిని ముందుగానే వదిలేసి మరమ్మతులు చేస్తున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఎగువ భాగాన కురుస్తున్నా వర్షాలకు ఘనాపూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తటంతో పొంగిపొర్లుతోంది. ఆ నీరు కింది భాగంలోని ఎంఎన్, ఎఫ్‌ఎం కెనాళ్ల ద్వారా నీరు ప్రవహిస్తోంది. ఈ రెండు కెనాళ్లు మెదక్, హవేళిఘనాపూర్, పాపన్నపేట, కొల్చారం మండలాల్లో సుమారు 80 కిలోమీటర్ల మేర కాలువలు విస్తరించి ఉన్నాయి.
30 వేల ఎకరాలకు!
ఈ రెండు కాల్వల ద్వారా అధికారికంగా 21,625 ఎకరాలకు సాగునీరందిస్తాయి. అనధికారికంగా మరో 5 వేల ఎకరాలు సాగవుతుంది. కాలువల నుంచి నీరు వదలగానే మెదక్, పాపన్నపేట, కొల్చారం, హవేళిఘనాపూర్ మండలాల పరిధిలోని 329 చెరువులను నింపి వాటిని భద్రపరిచి పంటపొలాలకు అవసరం ఉన్నప్పుడల్లా వినియోగించుకుంటారు. ఇది ప్రతి ఏటా జరిగే ప్రక్రియ. కాగా, గత కొన్ని రోజులుగా కాల్వల ద్వారా నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో కొన్ని చెరువులు, కుంటలు నిండుతుండగా, మరికొంత నీరు వృథాగా పోతుంది. కాల్వల తూములు ధ్వంసం కావటంతో వాటికి మరమ్మతులు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.
ఎలాంటి ఆదేశాలు రాలేదు..!
ఎల్‌నినో కారణంగా ఘనాపూర్ ప్రాజెక్టు నుంచి దిగువ ఎంఎన్, ఎఫ్‌ఎం కెనాళ్లకు నీటిని వదలాలి అని తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎగువ ప్రాంతంలో వర్షం కురవటంతో ప్రాజెక్టు నిండి కాల్వల ద్వారా ప్రవహిస్తోంది. ఈ కాల్వల తూములు ధ్వంసమయ్యాయి. వాటి మరమ్మతులకు ఎఫ్‌డీఆర్ నిధుల కోసం పంపించాం. అవి నేటికీ విడుదల కాలేదు.
–హిమబిందు, ఇరిగేషన్ డీఈ, మెదక్
స్వయంగా రైతులే...!
గతేడాది వరదలకు దెబ్బతిన్న తూములు, చెరువులను రైతులే బాగు చేయించుకున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు ముందుకొచ్చి వాటిని మరమ్మతులు చేయించారు. ఇందులోభాగంగా హవేళిఘనాపూర్ మండలం జక్కన్నపేట గ్రామం ఎంఎన్ కెనాల్ చివరాయకట్టులో ఉంది. జక్కన్నపేట చెరువు తూము గతేడాది ధ్వంసం కాగా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ గ్రామ సర్పంచ్ రూ.30 వేలు వెచ్చించి తూము సెంటర్‌ను కొనుగోలు చేసి అమర్చారు. ఇది ఒక్క జక్కన్నపేట పరిస్థితే కాదు అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.


