మెదక్ కలెక్టరేట్: మెతుకుసీమలో ఆషాఢ బోనాల సందడి నెలకొంది. గత కొన్ని వారాలుగా మెదక్ పట్టణంలోని పలు కులసంఘాలు గ్రామ దేవతలకు ఆషాఢ మాస బోనాలు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. దీంతో మెదక్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గత ఆదివారం ముదిరాజ్‌లు ఆరెకటిక సంఘాల ప్రజలు గ్రామ దేవతలైన మాత నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, బోరంచమ్మ అమ్మవార్లకు బోనాలు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఆదివారం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం, పద్మశాలి సంఘాల ప్రజలు పట్టణంలోని మాత నల్లపోచమ్మ అమ్మవారికి, కాళీమాత అమ్మవార్లకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లు, డప్పుచప్పుళ్ల మధ్య యువకుల కేరింతలతో బోనాల ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను నెత్తిన పెట్టుకుని అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బోనమెత్తిన ఎమ్మెల్యే రోహిత్‌రావు
ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన స్వర్ణకార, పద్మశాలి సంఘాల బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే రోహిత్‌రావు పాల్గొని బోనమెత్తారు. అలాగే ఉత్సవాల్లో యువకులతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్, స్వర్ణకార సంఘం పట్టణధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బ్రహ్మచారి, వేణుచారి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌చారి, కోశాధికారి రాజుచారి, యువజన అధ్యక్షుడు రవీందర్‌చారి, ప్రధాన కార్యదర్శి నరేశ్‌చారి, కోశాధికారి నవీన్‌చారి, పద్మశాలి సంఘాల జిల్లా అధ్యక్షుడు మేకల జయరాములు, పట్టణధ్యక్షుడు చెన్నా రామచందర్, కార్యదర్శి గుండు రమేశ్, కోశాధికారి బొద్దుల కృష్ణ, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, మహేశ్, భూపతిరాజు, బుడ్డ రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్‌లో బోనాల ఉత్సవాల్లో బోనం ఎత్తిన ఎమ్మెల్యే రోహిత్‌రావు
స్వర్ణకార, పద్మశాలి సంఘాల
బోనాల ఉత్సవాలు
పట్టణంలో ఆధ్యాత్మిక సందడి


