కంది(సంగారెడ్డి): మండల కేంద్రమైన కందిలో ఎలాంటి అనుమతులు పొందకుండా ఆర్ అండ్ బీ (ఐబీ) భవనాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సదరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులు కలసి ఆర్ అండ్ బీ భవనం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఆర్ అండ్ బీ అధికారుల నుంచి ఎలాంటి ఎన్‌ఓసీ తీసుకోకుండా భవనాన్ని ఎలా కూలుస్తారన్నారు. భవనాన్ని కూల్చివేసిన ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆర్ అండ్ బీ భవనంలో ఉన్న నాణ్యమైన టేకు కలప, ఇటుకలు, పునాది రాళ్లు, డోర్లు, కిటికీలు, రేకులు అన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భవనాన్ని ఇష్టారాజ్యంగా కూల్చివేసిన వాహనాలు, ఆ వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్‌గౌడ్, ఖాజాఖాన్, వడ్ల రవి, ఆనంద్‌రావు, కరీంఖాన్, జానీపాషా, ఆర్టీసీ నవాజ్, అర్జున్, సజ్జత్, బైండ్లనరసింహులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కంది గ్రామస్తుల డిమాండ్


