తూప్రాన్: పట్టణ కేంద్రంలో మహంకాళి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం పట్టణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. యువత డీజే సౌండ్స్, డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి ఘనంగా తొట్టెలను సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో జోగిని నిషాక్రాంతి బోనం ఎత్తుకొని చేసిన ప్రత్యేక నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.


