ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదు | - | Sakshi
Sakshi News home page

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఆగదు

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

మెదక్‌కలెక్టరేట్‌: కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మెదక్‌లో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌కోడ్స్‌ ఎవరి ప్రయోజనాల కోసం అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోడ్స్‌తో కేంద్ర ప్రభుత్వం పేదల కష్టాన్ని సంపన్నులకు దోచిపెడుతోందని ఆరోపించారు. కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ రద్దయ్యే వరకు ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. అలాగే విద్యుత్‌రంగాన్ని ప్రైవేట్‌పరం చేసి, ఉచిత విద్యుత్‌ను రద్దుచేసి రైతులపై భారం వేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. విత్తన సవరణ చట్టం అమలు చేసి విదేశీ విత్తన సంస్థలకు లాభాలు తేవడమేనా దేశభక్తి అంటే అని నిలదీశారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశం, సంతోష్‌, గణేశ్‌రెడ్డి, యశోద, కవిత, దుర్గ, దేవయ్య, యాదగిరి, వెంకన్న, దాసు, స్వరూప, షౌకత్‌, సిద్దవ్వ, సాయిలు, ప్రమీల, దుర్గయ్య, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

లేబర్‌ కోడ్స్‌ రద్దయ్యే వరకు ఊరుకోం

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేత అడివయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement