భూ సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): భూ భారతి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు. పెద్దశంకరంపేటలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి, రెవెన్యూ సదస్సులు, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

కస్తూర్బాలో విద్యాబోధన పరిశీలన

మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధన ఏవిధంగా చేస్తున్నారో పరిశీలించి, స్వయంగా విద్యార్థులకు ప్రశ్నలను వేసి జవాబులు అడిగారు. కస్తూర్బాకు సరఫరా చేసే కోడిగుడ్లు తక్కువ సైజ్‌ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జలసిరిపై అవగాహన

వీబీజీరాంజీ పథకం ద్వారా చేపడుతున్న జలసిరిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లిలో ఇందిరమ్మ ఇంటి వద్ద ఏర్పాటు చేస్తున్న మ్యాజిక్‌ సోక్‌పిట్‌ను పరిశీలించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా గ్రామస్థులతో కలిసి మొ క్కలను నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నారా యణ, ఎంపీడీఓ క్రాంతికుమార్‌, ఎంఈఓ శేఖర్‌, సర్పంచ్‌ జైపాల్‌గౌడ్‌, ప్రిన్సిపాల్‌ విజయ తదితరులున్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement