ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ టౌన్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలు అర్థరహితమని ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెస్స్(ఏఐ)యుగంలో శరవేగంతో ముందుకు వెళ్తున్న సమయంలో క్షుద్రపూజలు, చేతబడి, మూఢనమ్మకాల గురించి మాట్లాడం శోచనీయమన్నారు. ప్రభుత్వ కూలిపోవాలి, వర్షాలు అడ్డుకోవాలని హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నాయకులు అర్థంలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. బాధ్యత పదవుల్లో ఉన్న నాయకులు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


