టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో 83 కి.మీల మేర రోడ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరయ్యాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు 29 కి.మీలు, పంచాయతీరాజ్ రోడ్లు 54 కి.మీల అభివృద్ధికి ఈ నిధులు మంజూరయ్యా యని తెలిపారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి పెద్దాపూర్–అనంతసాగర్ (వయా తొగర్‌పల్లి)రోడ్డు, ముంబై హైవే నుంచి– బ్యాతోల్, ముంబై హైవే–ఇస్మాయిల్‌ఖాన్‌పేట రోడ్లను అభివృద్ధి చేస్తారన్నారు. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి ఎన్.హెచ్ 65 నుంచి చిమ్నాపూర్‌తాండా, సంగారెడ్డి –మల్కాపూర్ ఎక్స్‌రోడ్డు, సంగారెడ్డి–తాళ్లపల్లి రోడ్డు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని జగ్గారెడ్డి చెప్పారు.


