హవేళిఘణాపూర్(మెదక్): జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ వరద ఉధృతిని అదనపు కలెక్టర్ నగేశ్ మంగళవారం పరిశీలించారు. అనంతరం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున పోలీసు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోచమ్మరాళ్ శివారులో గతేడాది కొట్టుకుపోగా, తాత్కాలికంగా నిర్మించిన రోడ్డును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డికి ఆహ్వాన పత్రిక
నర్సాపూర్: ఈ నెల 10న నర్సాపూర్‌లో నిర్వహించనున్న తొట్టెల ఉత్సవాలకు రావాలని స్థానిక యువకులు స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావులను మంగళవారం ఆహ్వానించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మినృసింహ్మస్వామి ఆలయ కమిటీ సభ్యులు మహేందర్‌గౌడ్, హేమంత్, శ్రీధర్, పూర్ణచందర్, శ్యామ్, ప్రదీప్, భాను తదితరులు వారిద్దరిని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.


