న్యూస్‌రీల్
భూ ఆక్రమణను అడ్డుకోండి భూ ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. వివరాలు 9లో u
రామాయంపేట(మెదక్): జిల్లాలో రోజు రోజకు పెరిగిపోతున్న కోతుల బెడద నివారణకు అధికారులు నడుం బిగించారు. ఈమేరకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు రెండు రోజుల పాటు నిర్మల్ జిల్లా చించోలి వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోతుల పునరావాస, శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. దేశంలోనే ఈ కేంద్రం రెండోది కాగా, రాష్ట్రంలో మొట్ట మొదటిది. పలు జిల్లాల నుంచి ఇక్కడికి తరలించిన కోతులకు ఈ కేంద్రంలో శస్త్ర చికిత్స ద్వారా సంతాన నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈప్రక్రియలో భాగంగా జిల్లా నుంచి 980 కోతులను నిర్మల్ తరలించారు. వాటిలో ఇప్పటివరకు 300 వానరాలకు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఏడు నుంచి పది రోజుల వరకు ప్రత్యేక బోన్లలో ఉంచి ఆహారం అందించారు. అనంతరం అటవీ ప్రాంతాల్లో వదిలేస్తారు.
కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు
జిల్లాలో ఇటీవల కోతుల బెడద తీవ్రమైంది. గ్రామాల్లో వేల సంఖ్యలో ఉన్న వాటి బెడదను అరికట్టడానికి గాను గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పంట చేలను ధ్వంసం చేయడం, ప్రజలపై దాడులకు పూనుకోవడం లాంటి సంఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కోతుల బెడద అరికట్టడానికి గాను జిల్లాలో ప్రజలు అధికారులకు వినతిప్రతాలు అందజేశారు. మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు పశు సంవర్ధకశాఖ జిల్లా అధికారి వెంకటయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లాలో పునరావాస, శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించింది. జిల్లాలో సైతం కేంద్రం ఏర్పాటుకు అయ్యే నిధులు, ఇతరత్ర సమాచారాన్ని వారు సేకరించారు.
జిల్లా నుంచి నిర్మల్‌కు 980 కోతుల తరలింపు
నివారణకునడుం బిగించిన అధికారులు
ఇటీవల అక్కడి శస్త్ర చికిత్స కేంద్రం సందర్శన
కలెక్టర్‌కు నివేదిస్తాం
కలెక్టర్ ఆదేశాల మేరకు తాము ఇటీవల నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న కోతుల పునరావాస, శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించాం. అక్కడ జిల్లా నుంచి పట్టుకెళ్లిన కోతులకు ఆపరేషన్లు నిర్వహించారు. కేంద్రానికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తాం. – వెంకటయ్య, జిల్లా వెటర్నరీ అధికారి


