మెదక్ కలెక్టరేట్: టూరిస్ట్ హబ్ కోసం పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్వీ కన్సల్టెంట్ ప్రతినిధి నందన, టూరిజం డీఈ శ్రీశైలం, ఈడీఎం సందీప్, డీపీఆర్‌ఓ రామచంద్రరాజు తదితరతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధ్యాత్మిక, చారిత్రక, పర్యావరణ ప్రదేశాలు ఉండడం జిల్లాకు ఒక వరమని అన్నారు. అధికారులు సమన్వయంతో జిల్లా టూరిస్ట్ హబ్ కోసం కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లి పాల వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లల బలమైన భవిష్యత్‌కు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. అంతకుముందు ఈనెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరించారు. మొత్తం 57 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్‌తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


