నారాయణఖేడ్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పట్ల అలసత్వం వహించకుండా సత్వర పరిష్కారం చూపాలని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి అధికారులకు సూచించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 2022లో ఖేడ్ మండలానికి చెందిన 60 మంది గిరిజన యువతకు స్వయం ఉపాధి కోసం మంజూరైన రుణాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాజునాయక్ గిరిజన నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. తుర్కపల్లి తండాలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, పరిష్కరించాలని తండా యువకులతో పాటు పలు గ్రామాల బాధితులు వినతులు అందించారు. వాటిని పరిశీలించి ఆయాశాఖల అధికారులకు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధశాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ ఉమాహారతి


