మెదక్ కలెక్టరేట్: జిల్లాలో దివ్యాంగులకు సంబంధించి యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో యూడీఐడీ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 2025 మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 1523 యూడీఐడీ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం 13 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాసరావు, అదనపు డీఆర్డీఓ సరస్వతి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


