అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

అప్రమత్తంగా ఉండాలి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వర్షాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా భారీ వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండా లని సూచించారు. రైతులు తమ వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సర్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 90 శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. రెండు రోజుల్లో వందశాతం పూర్తి చేస్తామన్నారు. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉందని, వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. స మావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాద య్య, ఎంపీడీఓలు, ఆర్డీఓ రమాదేవి, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ గఫార్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement