బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం..! పవన్‌ కల్యాణ్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం..! పవన్‌ కల్యాణ్‌

Nov 24 2023 4:38 AM | Updated on Nov 24 2023 10:40 AM

- - Sakshi

రోడ్‌షోలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌

మెదక్‌/తూప్రాన్‌: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా గురువారం సాయంత్రం ఆయన చేగుంటలో రోడ్‌షో నిర్వహించారు. దుబ్బాక అభివృద్ధి కోసం వకీల్‌సాబ్‌ రఘునందన్‌రావు ఆరాటపడుతున్నారని ఆయనను గెలిపించాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన ప్రభాకర్‌రెడ్డి పదేళ్లుగా చేగుంటకు ఒక డిగ్రీ కళాశాల మంజూరు చేయించలేక పోయారని ఆరోపించారు. తనను గెలిపిస్తే గ్రామాలలోని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు భూపాల్‌, వైస్‌ ఎంపీపీ రాంచంద్రం, మాజీ ఎంపీపీ పాండు, సీనియర్‌ నాయకులు వెంగళరావు, గణేశ్‌ రవికుమార్‌, సంతో ష్‌రెడ్డి, నర్సింలు, ఎన్‌.చారి, బాలచందర్‌, రఘువీర్‌రావుతో పాటు పలు గ్రామాల బీజేపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి చదవండి: ‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అంద‌రు మూడు తోవల పోతున్నరు!

Advertisement
 
Advertisement
Advertisement