హవేళిఘణాపూర్(మెదక్): రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయడం వల్ల మంచి దిగుబడిి వచ్చి ఆదాయం పెరుగుతుందని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్ పేర్కొన్నారు. హవేళిఘణాపూర్‌లో మంగళవారం ప్రభు అనే రైతు సాగు చేసిన ఆయిల్‌పామ్ తోటను ప్రతాప్‌సింగ్ పరిశీలించి పంటకు మంచి దిగుబడినిచ్చే ఎలిడోబియస్ కెమెరోనికస్ మొక్కకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రైతులు వరి సాగు కాకుండా వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా మంచి దిగుబడు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ బాల్‌రెడ్డి, లీవ్‌ఫామ్ కంపెనీ మేనేజర్ కృష్ణ, కంపెనీ ప్రతినిధులు, ఏఈఓ తేజస్విని రైతులు పాల్గొన్నారు.
కార్యాలయాలు
ఏర్పాటు చేయండి
కలెక్టర్‌కు చిలప్‌చెడ్ వాసుల వినతి
మెదక్ కలెక్టరేట్: తామే స్థలాలను సేకరించామని కార్యాలయాలు నిర్మించాలంటూ చిలప్‌చెడ్ వాసులు కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని చిలప్‌చెడ్ మండల వాసులు మంగళవారం గ్రామ సర్పంచ్ అనిల్ ఆధ్వర్యంలో తరలివచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ...మండల కేంద్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యాలయాల ఏరఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2.25 కోట్లు మంజూరు చేస్తుందని తెలిపారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ వంటి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలంటూ కోరారు. ఇంకా స్థలం అవసరమైతే దానం చేసేందుకు స్థానిక గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివరాం, మాజీ ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మిదుర్గారెడ్డి, సొసైటీ డైరెక్టర్ గంగాధర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు పెద్ద ఎత్తున మండల ప్రజలు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆగ్రహానికి
గురికాక తప్పదు
టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్
మెదక్‌జోన్: ప్రభుత్వం ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్ కార్డులు ఆస్పత్రుల్లో పని చేయకపోవడం బాధాకరమని, ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగుల ఆగ్రహానికి గురికావటం ఖాయమని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. జూన్ నెల నుంచి ఉద్యోగుల వేతనాల్లో 1.5%మూడు నెలలుగా ఉద్యోగుల బీమా నిమిత్తం కోత విధిస్తున్న ప్రభుత్వం ఆస్పత్రుల్లో మాత్రం ఆరోగ్య కార్డులు చెల్లుబాటు కాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆస్పత్రి వర్గాలతో చర్చించి ఆస్పత్రికి వచ్చే ఉద్యోగులకు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మెదక్ జిల్లాను రాజన్న జోన్ నుంచి చార్మినార్ జోన్‌లో కలపాలని తీర్మానించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాండ్ల అనురాధ, జిల్లా సహాధ్యక్షుడు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షుడు అర్షద్, ఫజాలుద్దీన్ పాల్గొన్నారు.
సింగూరుకు
కొనసాగుతున్న వరద
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. వారం రోజులుగా డ్యామ్ పరీవాహకంలో వర్షాలు పడటంతో వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి ఈ నెల 9న 542 క్యూసె క్కులు, 10న 923 క్యూసెక్కులు, మంగళవారం 761 క్యూసెక్కుల వరద చేరింది. 29.9 టీ ఎంసీల సామర్థ్యం గల డ్యామ్‌లో ప్రస్తుతం 4.235 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రతీ రోజు మిషన్ భగీరథకు, జంట నగరాల తాగునీటికి నీటిని సరఫరా చేస్తున్నారు.


