స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో సాగాలి | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో సాగాలి

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌

రామాయంపేట(మెదక్‌): దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని యువత వారి అడుగుజాడల్లో నడవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన తిరంగయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని పిలుపు మేరకు మనం ఐదు రోజులపాటు జాతీయ జెండా పండుగను నిర్వహించుకుని ప్రపంచానికి మన ఐక్యత చాటి చెప్పాలన్నారు. ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర నాయకుడు రంజిత్‌ మోహన్‌, పార్టీ జిల్లాశాఖ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి పంజా విజయకుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement