జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైల్‌ | - | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైల్‌

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ సురేశ్‌ షెట్కార్‌

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ సురేశ్‌ షెట్కార్‌

జహీరాబాద్‌: హైదరాబాద్‌–ముంబై బుల్లెట్‌ రైలు ను యథాతధంగా జహీరాబాద్‌ మీదుగానే నడపా లని ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ భేటీ అయ్యి వినతి పత్రం సమర్పించారు. ఢిల్లీ–హైదరాబాద్‌–ముంబై బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ను మొదట ప్రతిపాదించిన విధంగానే సంగారెడ్డి, జహీరాబాద్‌, షోలాపూర్‌ మీదుగా కొనసాగించాలని రైల్వే మంత్రిని కోరారు. ఇటీవల కాలంలో ఈ రూట్‌ను తాండూరు, వికారాబాద్‌ల మీదుగా మళ్లించడానికి వస్తు న్న ప్రత్యామ్నాయ ప్రతిపాదన లపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని షెట్కార్‌ మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ సిద్ధం చేసిన ప్రాథమిక సమ గ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) ప్రకారమే అసలు రూట్‌కు కట్టుబడి ఉండాలని మంత్రిని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement