‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అంద‌రు మూడు తోవల పోతున్నరు!

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ‘రాం రామే.. రాజన్న. ఏం సంగతే. ఇయ్యల్ల పొద్దెక్కుతున్న ఓళ్లస్తలేరు.. సలిగూడ రెండొద్దుల సంది జరంత ఎక్కనే ఉన్నదే. గిలాసాల గింత గరం గరం చాయ్‌ వొయ్యే..’ అంటూ భోజన్న పక్క టేబుల్‌ మీద ఉన్న న్యూస్‌పేపర్‌ను తీసుకుని బెంచీ మీద కూసున్నడు.

‘ఏం జెప్పుమంటవే.. మొన్న రెండ్రోజులుగ రెండు పార్టీలోళ్లు దావత్‌ ఇచ్చి పోయిండ్రు గదనే.. నిన్న రాతిరి ఇగ ఈ పార్టోళ్లు గూడ మందు పంపినుండే. అది తాగుడు ఒడిసే సరికి రాతిరి బారా ఏక్‌ బజే అయ్యిందే. ఇంటికోయి బుక్కెడుబువ్వ గూడ తినలేదే. పండేసరికి రెండైంది. ఇగ నాకంటే హోటలు తీసుడు ఉంటదని పొద్దుగల్లనే లేసిన. మనోళ్లకు ఇంక రాతిరిది దిగనట్లున్నదే..’ అని హోటల్‌ రాజన్న రాతిరి జరిగిన ముచ్చట చెప్పిండు.

‘ఆవే భోజన్న.. నాకు తెల్వక అడుగుతున్న. ఏ పార్టోళ్లచ్చినా మనూళ్లే మస్తు పబ్లికు అస్తున్నరు.. అందరికీ జై గొడుతున్నరు.. ఆడోళ్లు మంగళారతులు పడుతున్నరు. ఆఖిరికి యాడికోతదో.. ఓళ్లను గెలిపిస్తరోనే..!’ అని పాలు మరగవెట్టుకుంట మల్ల రాజన్ననే అన్నడు.

‘అరె.. నువ్వు గమ్మతు మాట్లాడుతవేందే రాజన్న.. ఇగ ఊళ్లేకు పెద్దమనిషి అచ్చినంక సూడతందుకై న ఊరోళ్లు రారాయే.. అందరితోని మంచిగుండాల్నె బాపు. రేపు ఓళ్లు గెలుస్తరో తెల్వది.. ఓళ్లతోని పనివడతదో తెలుస్త దాయే..’ అని భోజన్న చెప్పుకచ్చిండు. ఇంతల.. నిర్మలక్కడికెళ్లి బైకు మీద గంగాధర్‌ సార్‌ అచ్చిండు. రాజన్న హోటల్‌ కాడ బండి ఆపి.. ‘ఏం భోజన్న నమస్తే.. ఏమంటుండు మన రాజన్న. మనూళ్లే గాలి ఎటున్నదే మరి..?’ అనుకుంట అచ్చి బెంచీ మీద కూసున్నడు.

‘ఏమో సార్‌.. ఈసారి ఓట్లల ఎటూ చెప్పస్త లేదు. మనూరోళ్లు ఓళ్లకు ఓట్లు గుద్దతరో తెలుస్తలేదు. అన్ని పార్టీలకు తిరుగుతున్నరు. అందరికాడికి పోతున్నరు. ఏమిచ్చినా తీసుకుంటున్నరు..’ అని భోజన్న చెప్పిండు. ‘సార్‌.. మనూళ్లే గాలి ఎటుంటదో చెప్పలేం గన్ని.. గ కేసీయారు, రేవంతంరెడ్డి, ప్రియాంకగాంధీ, మోదీ సారు.. గీళ్లంతా గాలి మోటర్లల మస్తు అస్తున్నరు. మనక్కడ బాగ దిరుగుతున్నరు. దినాం టీవీలల్ల కనవడే పెద్ద పెద్దోళ్లు మన కండ్లముంగట కనిపించే సరికి గమ్మతనిపిస్తుంది. గిట్ల ఎప్పుడు రాలే సారు. పార్టీల ముచ్చటేందో గన్ని.. గ పెద్దోళ్లను సూడతందుకే మస్తుమంది పోతున్నరు.’ అని రాజన్న ఉడుకుతున్న చాయ్‌ను కలుపుకుంట ముచ్చట పెట్టిండు.

‘ఆ.. ఏమున్నది రాజన్న ఎన్నికలన్నంక ఓళ్ల పార్టీని గెలిపించుకునేతందుకు ఆళ్లు అస్తనే ఉంటరు. యాడనో ఢిల్లీల ఉండేటోళ్లు.. మన గల్లీ కాడిదాకా ఏంటికస్తరంటవ్‌..? ఓట్ల కోసమే గదా. ఈసారి మన రాష్ట్రంల ఎన్నికలు ఓళ్లకో ఒక్కళ్లకు అన్నట్లు లేవు. అందుకు గ పెద్దలీడర్లు అస్తున్నరు..’ అని గంగాధర్‌ సార్‌ చెప్పిండు.

‘సార్‌.. మనూరి సంగతి ఇడిసిపెట్టుండ్రి.. మన జిల్లల గాలి ఎటుంటది.. ఓళ్లు గెలిసేటట్టున్నరు..’ అని అప్పుడే చేసిన గోల్డన్‌ చాయ్‌ సార్‌ చేతికందిస్తూ రాజన్న అడిగిండు. ‘ఏమో.. రాజన్న మనూళ్లే ఉన్నట్లనే జిల్లాల గూడ గదే ముచ్చటున్నది. ఓళ్లకేం చెప్పస్తలేదు. అన్ని పార్టీలోళ్లు మస్తు తిరుగుతున్నరు. మస్తు కర్సువెడుతున్నరు. అన్ని నియోజకవర్గాలల్ల ఓట్లు ఎటువడుతయో ఇప్పుడైతే చెప్పుడు కష్టంగనే ఉన్నది. ఏ పార్టీకాపార్టీ గట్టిగనే కష్టపడుతున్నయ్‌. సగం, సగం చెబుదామంటే.. మూడో పార్టీ గూడ నేనేం తక్కువనా.. అన్నట్టున్నది. ఓళ్లు గెల్సినా గొన్ని ఓట్లతోనే గెలుస్తరనైతే అంటున్నరు..’ అని గంగాధర్‌ సార్‌ వివరించిండు.

ఇంతలో.. రాజన్న హోటల్‌ కాడికి నర్సయ్య అచ్చిండు. ‘సార్‌.. మీరన్ని తెల్సినోళ్లు. దినాం నిర్మల్ల సార్లతోని తిరుగుతరు గదా.. మరి ఏ పార్టీవోల్లకు ఓటేస్తే మంచిదంటరు..’ అని నర్సయ్య అడిగిండు. ‘సూడు నర్సన్న.. ఓటనేది ఒకళ్లు చెప్తే ఏసేది గాదు. మనమే మంచిగ ఆలోచించుకుని ఏయాలే. ఇయ్యల్ల ఏ పార్టీ ఏమంటున్నది.. ఏ అభ్యర్థి ఏం జెపుతున్నడు.. అన్నది సూడాలె. గాలి ఎటుంటే అటు పోవుడు గాదు. మన మంచిచెడ్డలకు, మన పిల్లగాండ్ల కోసం పనికొచ్చెటోళ్లకు ఓటేయ్యాలె. సూడు.. ఇప్పుడు నిల్సున్నోళ్లల నీకు సై అనిపించినోళ్లకు ఓటేయ్‌. నేను జెప్పినోళ్లకో.. ఇంకొక్కళ్లు చెప్పినోళ్లకో ఓటేసుడు కరెక్టు గాదు. నీది నువ్వే ఆలోచించాలె. అసలైన పనిమంతుడికి ఓటెయ్యాలె..’ అని గంగాదర్‌ సార్‌ వివరించిండు. ఆయన మాట్లాడినంత సేపూ.. రాజన్న హోటల్‌ కాడ ఉన్నోళ్లందరూ మంచిగ ఇన్నరు.

‘సారు.. మంచిగ చెప్పిండ్రు. ఇయ్యళ్ల పైసలిస్తుండ్రని, మందు పోస్తున్నరని ఆశ పడితే.. ఐదేండ్ల ముచ్చట ఉత్తదే అయితది..’ అని నర్సన్న రెండు చేతులు జోడించిండు. ఇంతలనే బడికి టైం అయితుందని.. గంగాధర్‌ సార్‌ బండి తీసుకుని వాళ్లందరికీ రాంరాం చెప్పి బడికి పోయిండు. ఇగ అక్కడునోళ్లందరు మల్ల రోజటి లెక్కనే ఊరి కాడికెళ్లి మొదలువెడితే.. పట్నం దాకా రాజకీయాల ముచ్చట్ల పడ్డరు.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-11-2023
Nov 24, 2023, 09:46 IST
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎల్‌ఓలు ఓటర్‌ చీటీలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఓటరు చీటీలు అందకుంటే ఆగం...
24-11-2023
Nov 24, 2023, 09:36 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
24-11-2023
Nov 24, 2023, 09:33 IST
ప్రధాన పార్టీలేమో వ్యూహాత్మక ఎత్తుగడల నడుమ కీలక నేతల పోరు తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
24-11-2023
Nov 24, 2023, 09:21 IST
మహబూబ్‌నగర్‌: ఇక్కడి నుంచి కర్ణాటక ఐదు కిలో మీటర్ల దూరమే.. ఎమ్మెల్యే రామన్న నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తాడు.. అందరూ...
24-11-2023
Nov 24, 2023, 09:12 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్‌ బ్యాలెట్‌ మిస్సింగ్‌ అవ్వడం ఆదిలాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం...
24-11-2023
Nov 24, 2023, 09:05 IST
హైదరాబాద్: ఐటీ కంపెనీలకు నిలయంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. టెకీలతో పాటు ఐటీ...
24-11-2023
Nov 24, 2023, 08:59 IST
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే...
24-11-2023
Nov 24, 2023, 04:45 IST
సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర మంత్రి...
24-11-2023
Nov 24, 2023, 04:36 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో హ్యాట్రిక్‌ విజయం లక్ష్యంగా భారత్‌ రాష్ట్ర సమితి సర్వశక్తులూ...
24-11-2023
Nov 24, 2023, 04:29 IST
సాక్షి, పెద్దపల్లి: బీఆర్‌ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని, కాన్షీరాం చనిపోతే కనీసం సంతాపదినం ప్రకటించని...
24-11-2023
Nov 24, 2023, 04:22 IST
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వందలాది మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ.. కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిందని...
23-11-2023
Nov 23, 2023, 15:17 IST
ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ సంపదను మేం పెంచేలా చూస్తున్నాం, కానీ.. 
23-11-2023
Nov 23, 2023, 14:04 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది....
23-11-2023
Nov 23, 2023, 13:39 IST
ప్రాజెక్టుల విషయంలో ఇలా జరగడం సహజం. ఆ మాత్రం దానికే విమర్శలు చేయడం.. 
23-11-2023
Nov 23, 2023, 12:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల...
23-11-2023
Nov 23, 2023, 12:24 IST
నిర్మల్‌ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్‌ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే...
23-11-2023
Nov 23, 2023, 12:17 IST
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని...
23-11-2023
Nov 23, 2023, 11:53 IST
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్‌ తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు....
23-11-2023
Nov 23, 2023, 11:46 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్‌ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ...
23-11-2023
Nov 23, 2023, 11:39 IST
వికారాబాద్: మండల పరిధిలోని గ్రామాల్లో కారు, హస్తం నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు... 

Read also in:
Back to Top