స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!

- - Sakshi

ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు..

ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 17327

బోథ్‌ నియోజకవర్గంలో అత్యధికం!

సాక్షి, ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్‌ ఆఫ్‌ ద ఎబోవ్‌) బటన్‌ తీసుకొచ్చారు.

ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్‌ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్‌ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు.

ఇలా ఈవీఎంల్లోకి..
2013లో పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థ రూపొందించింది.

బోథ్‌: బోథ్‌ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్‌ నాయక్‌కు 677, ఆర్‌జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్‌కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్‌కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్‌ అయ్యాయి.
ఇవి చ‌ద‌వండి: తూర్పున కాంగ్రెస్‌, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్‌ఎస్‌..

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

04-12-2023
Dec 04, 2023, 15:38 IST
సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదని బీజేపీ స్టేట్‌ చీఫ్‌ కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ...
04-12-2023
Dec 04, 2023, 09:25 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీలో ప్రజలు గెలిపించారు. దీంతో, ప్రభుత్వ ఏర్పాట్లకు కాంగ్రెస్‌...
04-12-2023
Dec 04, 2023, 08:21 IST
సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,...
04-12-2023
Dec 04, 2023, 08:11 IST
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో...
04-12-2023
Dec 04, 2023, 07:25 IST
పాలకుర్తి అసెంబ్లీ చరిత్రలో తొలిసారి 26 ఏళ్ల పిన్న వయస్కురాలిగా యశస్విని గెలుపొందారు.
04-12-2023
Dec 04, 2023, 06:04 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి...
04-12-2023
Dec 04, 2023, 05:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో...
04-12-2023
Dec 04, 2023, 05:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో...
04-12-2023
Dec 04, 2023, 05:32 IST
సాక్షి, హైదరాబాద్‌/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం...
04-12-2023
Dec 04, 2023, 05:20 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు....
04-12-2023
Dec 04, 2023, 05:00 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా...
04-12-2023
Dec 04, 2023, 04:36 IST
సాక్షి, హైదరాబాద్‌/ ఆసిఫాబాద్‌: బహుజన సమా­జ్‌ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజన­వాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన...
04-12-2023
Dec 04, 2023, 04:22 IST
సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష...
04-12-2023
Dec 04, 2023, 01:20 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పుతో ఈ ఎన్నికల్లో తమ వైవిధ్యాన్ని చాటారు. తూర్పున...
03-12-2023
Dec 03, 2023, 21:18 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్‌ తెలిపారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ...
03-12-2023
Dec 03, 2023, 19:36 IST
హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ...
03-12-2023
Dec 03, 2023, 19:28 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. మొత్తంగా కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పైచేయి...
03-12-2023
Dec 03, 2023, 17:49 IST
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) సస్పెండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్‌ అమల్లో...
03-12-2023
Dec 03, 2023, 17:16 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ‍ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు  మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది....
03-12-2023
Dec 03, 2023, 16:52 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి... 

Read also in:
Back to Top