0,1,2,3,4,5,6,7,8,9,10 | - | Sakshi
Sakshi News home page

0,1,2,3,4,5,6,7,8,9,10

Feb 15 2026 7:19 AM | Updated on Feb 15 2026 7:19 AM

0,1,2,3,4,5,6,7,8,9,10

0,1,2,3,4,5,6,7,8,9,10

● స్వతంత్రులకు పోలైన ఓట్లు

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల బరిలో పోటీచేసిన పలువురు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవి. పట్టణంలోని 49 వార్డుల పరిధిలో స్వతంత్రులు ఏఐఎఫ్‌బీ తరపున పోటీ చేసిన పలువురు అభ్యర్థులకు పది లోపు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఐదుగురు స్వతంత్రులుగా విజయం సాధించినప్పటికి మెజార్టీ వార్డులో వారి ప్రభావం నామమాత్రమే. కనీస ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమయ్యారు. సున్నా, ఒకటి, రెండు, 3 ఇలా పదిలోపు ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 38వ వార్డు నుంచి పోటీ చేసిన నస్రీన్‌ సుల్తానకు ఒక్క ఓటు రాలేదు. ఆమె తన ఓటు వేసుకోనట్లుగా తెలుస్తోంది. 9వ వార్డు నుంచి పోటీ చేసిన శీల చౌహాన్‌కు ఒకే ఒక్క ఓటు పోలైంది. అది కూడా తన ఓటు వేసుకుంది. 1వ వార్డులో వాగ్మారే శాంభవికి, 9వ వార్డులో సురేఖ రహతేకు 2 ఓట్ల చొప్పున మాత్రమే వచ్చాయి. 4వ వార్డులో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి సయ్యద్‌ ఖుర్షీద్‌కు 16వ వార్డులో రుఖియా బేగం, 26వ వార్డులో అమ్రీన్‌ బేగంకు 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 8వ వార్డులో దులే ఉజ్వల, 21వ వార్డులో జబీనా షేక్‌కు 4 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2వ వార్డులో షేక్‌ మహమూద్‌కు, 5వ వార్డులో దార్శ రుక్మాకు 5 ఓట్ల చొప్పున రాగా 17వ వార్డులో భవిత పవల్కర్‌కు 6, 40వ వార్డులో నవనందుల నర్సయ్యకు ఆరు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 22వ వార్డులో అబ్దుల్‌ ఇమ్రాన్‌కు 7, 23వ వార్డులో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి అబ్దుల్‌ ఖయ్యూం రజాకు ఏడు ఓట్లు పోలయ్యాయి. 18వ వార్డులో జీవ్‌నే రవీందర్‌, 42వ వార్డులో తుర్పటి పద్మకు 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. 24వ వార్డులో అశోక్‌ దీకుండ్‌వార్‌, 29వ వార్డులో సఫియా బేగంకు 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. 25వ వార్డులో పనకంటి వర్షాజోషి, 42వ వార్డులో ముత్యాల రాధకు పది ఓట్ల చొప్పున పోలయ్యాయి. 39వ వార్డులో లాంటిలే వర్షకు 11 ఓట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement