కొత్తవారికే పట్టం
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు వి భిన్న తీర్పునిచ్చారు. మున్సిపాలిటీలో 19,903 ఓ టర్లకుగాను 15,095 ఓట్లు పోలు కాగా, 75.85 శా తం నమోదైంది. 90 శాతం పైగా ఓటర్లు కొత్తవారికే పట్టం కట్టారు. సమస్యలపై ప్రశ్నించే గొంతుకలు, సమర్థవంతుడు, వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వానికి ఓటర్లు మద్దతు పలికారు.
అభ్యర్థుల ఎంపిక కీలకం..
అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీల రెబల్స్ బెడద లేకుండా పార్టీని నమ్ముకున్న వారికే టికెట్లు ఇవ్వడంతో అధికార పార్టీకి మేలు జరిగింది. 18 వార్డులకు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి 11 స్థానాలు ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ గెలిచిన 11 సీట్లలో కొత్తతరం గెలువడం గమనార్హం. ఇకపోతే బీఆర్‌ఎస్ 18, బీజేపీ 18 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ 2 చోట్ల గెలుపొందగా ఒకటి మాజీ కాగా, మరోచోట కొత్తగా పోటీ చేసిన వ్యక్తి విజయం సాధించారు. బీఆర్‌ఎస్ 4 స్థానాలు గెలుచుకోగా ఒక సీటు మాజీ కై వసం చేసుకోగా మూడు చోట్ల కొత్త వారికి చోటు దక్కింది. 1 వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ భార్య మొదటి సారి పోటీ చేసి విజయం సాధించగా, 16 స్థానాలను కొత్తవారికే దక్కింది. రెండు సీట్లలో పాతవారికి అవకాశం దక్కింది. 18 వార్డుల్లో గెలిచిన 13 మంది కౌన్సిలర్లు 45 ఏళ్లలోపు కావడం విశేషం. ఈనెల 16న గెలిచినవారు మున్సిపాలిటీలో అడుగుపెట్టనున్నారు.


