చెన్నూర్: చెన్నూర్ జాతీయరహదారి పక్కన గల సర్వేనంబర్ 869/21లో 3.20 ఎకరాల జగన్నాథాలయ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ఈవో ముక్త రవి తెలిపారు. స్థానిక జగన్నాథాలయంలో ఎండోమెంట్ అధికారులతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూకల సతీశ్‌తోపాటు అనుచరులు ఆలయానికి చెందిన భూమిని ఆక్రమించుకుని 200 మామిడి చెట్లను నాటి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారని తెలిపారు. చెన్నూర్, కోటపల్లి, భీమారం పోలీసుల సహాయంతో రెండు జేసీబీలు ఏర్పాటు చేసి మామిడి చెట్లు, కంచె తొలగించామన్నారు. అధికారులను అడ్డుకునేందుకు ఇనుప రాడ్లు, కారంపొడి, బండరాళ్లు పెట్రోల్‌తో కబ్జాదా రులు దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు.అధి కారుల వద్ద ఉన్న రికార్డులను కనుకుంట్ల వెంకట రాజం ఎత్తుకెళ్లారు. అధికారుల ఫిర్యాదుతో నూకల సతీశ్, కనుకుంట్ల వెంకటరాజం, బడికల వెంకటేశ్, కేదాసు సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ బ న్సీలాల్ తెలిపారు. ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ రవికిషన్, ఈవోలు భూ మ య్య,చంద్రశేఖర్, భూమయ్య, రాజేశ్ పాల్గొన్నారు.


