మంచిర్యాలక్రైం: ఆటాపాటలతో గడపాల్సిన బాల్యం నేరాల ఊబిలో చిక్కుకుంటోంది. పిల్లలు చెడు స్నేహం, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్‌నెట్, మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. బడికి వెళ్లిన పిల్లలు ఎ క్కడికెళ్తున్నారు.. ఏం చూస్తున్నారు.. ఏం చేస్తున్నారో.. అనే విషయాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పించింది. పలువురు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చివరికి హత్యల వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలను వేధిస్తూ షీ టీమ్‌కు చిక్కుతున్నవారిలో మైనర్లూ ఉండడం ఇందుకు నిదర్శనం. ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన చెన్నూర్ మండలంలోని కోటపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికపై మరో బాలుడు లైంగికదా డికి పాల్పడిన ఘటన తల్లిదండ్రుల్లో ఆందోళన కలి గించింది. తాజాగా జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీకి చెందిన ఓ బాలుడు మరో బాలికను వేధించినందుకు ఆమె బంధువు సదరు బాలుడిని మందలించాడు. దీంతో మద్యం మత్తులో ఆ బాలుడు బాధిత బాలిక బంధువును దారుణంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
పేద మధ్యతరగతిలోనే అఽధికం
పాఠశాల స్థాయిలోనే కొందరు విద్యార్థుల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పెరుగుతున్న ఖర్చులు, అదనపు ఆదాయవనరుల కోసం నిరంతరం తల్లిదండ్రులిద్దరూ శ్రమిస్తుంటారు. ఉదయం వెళ్లి సాయంత్రం ఇల్లు చేరే దంపతులు ఒత్తిడితో తమ పిల్లలపై పూర్తి స్థాయి దృష్టి సారించలేక పోతున్నారు. మరి కొందరు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చే స్తుండడంతో పిల్లలను పట్టించుకోవడంలేదు. వీటి కి తోడు పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కలహాలు, ఆలుమగల మధ్య మనస్పర్థలు తలెత్తినప్పుడు గొడవలు జరగడం.. వాటి ప్రభావం పిల్ల ల పై పడడం కారణంగానే పిల్లలు పెడదారి పడుతున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 2025 సంవత్సరంలో 37కేసులు నమోదు కాగా, వీ టిలో 62 మంది మైనర్లు, 2026లో జూన్ వరకు 33 కేసులు నమోదు కాగా, 45 మంది మైనర్లున్నారు.


