పాతమంచిర్యాల: రాజకీయాలకు అతీతంగా ము న్నూరు కాపుల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్ధర్ పుట్టం పురుషోత్తం రావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నార్త్‌ఇన్ హోటల్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. రాష్ట్రంలో మున్నూరు కాపుల సామాజిక ఆర్థిక స్థితి పెరగాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ము న్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావా లని ఆకాంక్షించారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒ క్కరూ ఐక్యంగా పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జనగణన సర్వేలో ము న్నూరు కాపుల జనాభాను తక్కుగా చూపించారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వ రకు ప్రత్యేక సర్వే నిర్వహించి తమ జనాభా సంఖ్య ను ప్రభుత్వం ముందుంచుతామని పేర్కొన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి పటేల్ మాట్లాడుతూ.. ప్రతీ జిల్లాలో ము న్నూరు కాపుల కోసం ఆత్మగౌరవ భవనాలతోపా టు హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి భవనం నిర్మించాలని కోరారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరని మధుకర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదే సత్యం, జిల్లా ఇన్‌చార్జి తిరుపతి, అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబులపు శ్రీనివాస్, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ తూముల నరేశ్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లేశ్ తదితరులున్నారు.


