రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి గద్దెరాగిడిలోని జీఆర్‌ఎం టౌన్‌షిప్‌లో చోరీ జరిగింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి బొమ్మ మొగిలి రెండు రోజుల క్రితం ఊరికి వెళ్లి సోమవారం తిరిగి ఇంటికి రాగా తాళం పగులగొట్టి తలుపులు తెరిచి ఉండటంతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ ఎల్‌ఈడీ టీవీతో పాటు గళ్ల గురిగిలో దాచిన సుమారు రూ.50వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు పట్టణ ఎస్సై శ్రీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


