చికిత్స పొందుతూ యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడు మృతి

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన రాందేని రాకేశ్‌ (25) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రాకేశ్‌కు గత ఏడాది ఇదే గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. ఈనెల 19న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్నపాటి గొడవకు భార్య వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాకేశ్‌ గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రాకేశ్‌ తండ్రి భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement